ఇరాన్ లోని భారత పౌరులకు మరోసారి అడ్వైజరీ

Spread the love

మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరోసారి భారత్ ఇరాన్ లోని భారత పౌరుల కోసం అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవలి పరిణామాల దృష్ట్యా, ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు ఎంబసీ (రాయబార కార్యాలయం)తో సమన్వయం చేసుకుంటూ, ఎంబసీ సూచించిన మార్గాల ద్వారా వీలైనంత త్వరగా ఇరాన్ నుండి నిష్క్రమించాలని గట్టిగా సూచించింది. ఎంబసీతో ముందస్తు సంప్రదింపులు మరియు సమన్వయం లేకుండా ఎటువంటి అంతర్జాతీయ భూ సరిహద్దులను చేరుకోవడానికి ప్రయత్నించవద్దని మరోసారి నొక్కి చెప్పింది. ఎంబసీ అత్యవసర సహాయం కోసం నంబర్లు కూడా అందులో పేర్కొంది. 

Mobile Numbers: +989128109115;  +989128109109;   +989128109102;    +989932179359

Email: cons.tehran@mea.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *