డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పడవ పోటీల ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్, ఎస్పీ రాహుల్ మీనా & ఇతర అధికారులు కలిసి గోదావరిలో బోటుపై వెళ్లారు. పడవలపై పోటీ జరిగే ప్రదేశాన్ని పర్యవేక్షిస్తున్న సమయంలో, కలెక్టర్ అకస్మాత్తుగా బోటు నుంచి జారి నీటిలో పడిపోయారు.అయితే, ఆయన అప్పటికే లైఫ్ జాకెట్ ధరించి ఉండటం , చుట్టూ నైపుణ్యం కలిగిన స్విమ్మర్లు ఉండటంతో తక్షణమే అధికారులు ఆయనను సురక్షితంగా బయటకు తీశారు. లైఫ్ జాకెట్ ఉండటం వల్లే పెను ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కలెక్టర్ తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు.