మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలి:ఏపీసీసీ చీఫ్ షర్మిల 

Spread the love

రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి  పథకానికి అతి గతి లేదని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల విమర్శించారు. మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండుగల పేరు చెప్పి కాలయాపన తప్పా మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదని కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. . పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ, మహిళలు రెడీగా ఉండమని  మరొకరు.. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.  ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు  గారు చేసింది ఘరానా మోసమేనని ఆరోపించారు.  నెలకిచ్చే 15 వందలతో 15 వేలు చేస్తాం అన్నారు. 15 వేలను లక్షా 50 వేలకు ఆదాయం పెంచే మార్గం చూపుతాం అన్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి  బూటకపు మాటలంటూ దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా బరోసా నిచ్చే హామీ అని ప్రతి ఏడాది 18 వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోడాన్ని షర్మిల ఆక్షేపించారు. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎన్నికల హామీలనేవి నచ్చినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అమలు చేసేవి కావన్నారు.