దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఇంటర్నేషనల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు అలాగే భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు తదితర అంశాల నేపథ్యంలో సూచీలు జోరు చూపలేకపోయాయి. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్250 పాయింట్ల నష్టంతో 83,627 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 25,732 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.21 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ లో ఇండిగో,ట్రెంట్, రిలయన్స్,మారుతీ ఎల్ అండ్ టీ షేర్లు ప్రధానంగా నష్టాలలో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఎస్.బీ.ఐ, టీసీఎస్ షేర్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్, రియల్టీ ఇండెక్స్ నష్టపోయాయి. మరోవైపు, పీఎస్‌యూ బ్యాంకింగ్, మీడియా రంగాల షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించడంతో ఆయా సూచీలు లాభపడ్డాయి.