ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అల్కరాస్

Spread the love

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా స్పెయిన్ టెన్నిస్ సూపర్ స్టార్ అల్కరాస్ నిలిచాడు. ఫైనల్ లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ పై 2-6,6-2,6-3,7-5తో గెలిచి తన కెరీర్ లో లేని ఒకే ఒక్క గ్రాండ్ స్లామ్ కలను కూడా సాకారం చేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ లో ఓడిపోవడం జకోవిచ్ కు ఇదే మొదటి సారి కావడం గమనార్హం. అతను ఈ టైటిల్ ను 10 సార్లు గెలుచుకున్నాడు. 25వ గ్రాండ్ స్లామ్ ను గెలవాలని భావించాడు. అయితే విజయం అల్కరాస్ కు దక్కింది. ఇద్దరు హోరాహోరీగా పోరాడారు. మొదటి సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలిచిన అల్కరాస్ (22) కెరీర్ గ్రాండ్ స్లామ్ ను పూర్తి చేసి ఆ ఘనత అందుకున్న పిన్నవయస్కుడిగా నిలిచాడు.