ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. టీడీపీ ఎంపీలను కలిశారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రకటనలు చేసిన నేపథ్యంలో అందులో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశాల గురించి ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు తెలిసింది. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయన పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. బడ్జెట్ పై అన్ని వర్గాల నుండి వ్యక్తమవుతున్న అభిప్రాయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. ఈరోజు రాత్రి లోకేశ్ తిరిగి విజయవాడ తిరిగి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.