మంగళగిరిలో లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్

Spread the love

మంగళగిరి నియోజకవర్గం, ఆత్మకూరులో లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి రూపుదిద్దుకుంటుందని లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం ఆత్మకూరులో ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘం(AELC) ఆత్మకూరు ప్యారిష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి నూతన చర్చిని ప్రారంభించారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడారు.  ఎవరూ ఊహించని విధంగా మన మందిరాన్ని పునర్ నిర్మించుకోవడం జరిగింది. నేను ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చినా, చర్చికి వచ్చినా, దేవాలయానికి వచ్చినా ఒక్కటే చెబుతాను. దేవుడు మనకు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకు ఇస్తాడు. కష్టాల్లో ఉన్న మన తోటివారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని  వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.  ఈ మందిరం పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం దేవుడు కల్పించాడు. చర్చి నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తిచేయాలని చెప్పాను. ఏ పని చేసినా సంకల్పం, పట్టుదల ముఖ్యం. పునర్ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అద్భుతంగా మందిరాన్ని నిర్మించారని ప్రశంసించారు.