భారత్ కు  అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ డే విషెస్

Spread the love

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు భారత్ లోని అమెరికన్ ఎంబసీ ఆయన సందేశాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది.  మీరు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, అమెరికా ప్రజల తరపున నేను భారత ప్రభుత్వానికి మరియు ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా మరియు భారత్‌లు చారిత్రాత్మక బంధాన్ని కలిగి ఉన్నాయని అమెరికన్  ప్రెసిడెంట్ డొనాల్డ్ జె. ట్రంప్ పేర్కొన్నారు. ఇక అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రానున్నసంవత్సరంలో పరస్పర లక్ష్యాల సాధనకు కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కీలక  రంగాల్లో ఇరు దేశాల మధ్య బలమైన సహకారం ఉంది. క్వాడ్ వేదికగా బహుళస్థాయి భాగస్వామ్యంతో ఇరు దేశాలకు, ఇండో-పసిఫిక్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతోందని రూబియో తన ప్రకటనలో పేర్కొన్నారు.