చూసిందే నమ్మండి…హెరిటేజ్ పై నారా భువనేశ్వరి ఆసక్తికర పోస్ట్

Spread the love

హెరిటేజ్ పై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం నడుస్తోంది. కాగా, హెరిటేజ్ గురించి హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. #HeritagePromise – చూసిందే నమ్మండి33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు. ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుంది. 500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో మేము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నామని ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే — చూసిందే నమ్మండి అంటూ ఒక వీడియోను పొందుపరిచారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *