కూటమి నేతల కుటుంబాలతో మంత్రి లోకేష్ విందు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కూటమికి చెందిన కీలక నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత అనుబంధాలను పంచుకున్న ఈ సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లోకేష్ ఆహ్వానం మేరకు ఉండవల్లి నివాసానికి వచ్చిన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో కలిసి లోకేష్ భోజనం చేశారు. ఈ సందర్భంగా పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆయా ప్రజా ప్రతినిధులు ఇచ్చిన వినతులు తాజా స్థితి నివేదికలు వారికి అందజేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఆత్మీయ కలయిక సంతోషాన్ని నింపిందని లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇది ఒక నూతన ఆరంభమని రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే నాయకుల కుటుంబ సభ్యుల బాగోగుల గురించి తెలుసుకునేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని నేతలు పేర్కొన్నారు.