ఏపీలో పిబ్రవరి 2 నుంచి నరేగా ను కాపాడేందుకు ఉద్యమం:ఏపీసీసీ చీఫ్ షర్మిల

Spread the love

నరేగా యాక్ట్ అద్భతమైన పథకమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. మన రాష్ట్రంలో నరేగా కింద ఈ  ఏడాదిలో 91.44 లక్షల కూలీలు యాక్టివ్ గా ఉన్నారు. ఉపాధి హామీకి శ్రీకారం చుట్టింది మన రాష్ట్రంలోనేనని ఆనాడు సోనియా , మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించారు YSR ముఖ్యమంత్రిగా దేశంలోనే ఈ పథకం ఏపీలో  పైలట్ ప్రాజెక్ట్ అని ఉపాధి హామీ సక్సెస్ లో ఏపీ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. 20 ఏళ్లలో ఉపాధి హామీ పథకం కూలీలలో ఆత్మవిశ్వాసం నింపిందని విలేజ్ లో ఎకనామీ యాక్టివిటీ పెరిగిందన్నారు. గ్రామాలు ఎంతో అభివృద్ధి జరిగాయని వివరించారు. ఇంత గొప్ప పథకం పై బీజేపీ కక్ష్య గట్టిందని ఆరోపించారు.ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తుందని ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు.  చంద్రబాబు  వీబీ రామ్ జీ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారు ? అని ప్రశ్నించారు. కొత్త పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గ్రామ్ జి గ్రామ వ్యవస్థను వినాశనం చేస్తుందని ఏపీలో పిబ్రవరి 2 నుంచి నరేగా ను కాపాడేందుకు ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం పరిరక్షణ యాత్ర మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2 నాటికి మన్రేగా మొదలు పెట్టి 20 ఏళ్లు.పథకం ప్రారంభించిన బండ్లపల్లి నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలో ఉద్యమం సాగుతుందని తానే స్వయంగా అన్ని జిల్లాలో పర్యటిస్తానని షర్మిల పేర్కొన్నారు. మన్రేగా ను కొనసాగించాలి . రోజువారీ వేతనాన్ని 400 వందలకు పెంచాలన్నారు. ఈ యాత్ర కి సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఇటీవల పాదయాత్ర ప్రకటన చేసిన మాజీ సీఎం జగన్ పైనా షర్మిల విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర ఎందుకు ? అధికారం కోసమే కదా ఈ పాట్లు ? అధికారం ఇస్తే ఏం చేశారు ? అని ప్రశ్నించారు. జగన్ కి పవర్ సూట్ అవ్వలేదని జగన్ నేచర్ మారాలని జగన్ నైజం మారాలని జగన్ లో మార్పు రావాలని అన్నారు.  ఏడాది న్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్స్ ఎందుకు ? చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకు ?అని షర్మిల ప్రశ్నించారు.