వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు నా శుభాకాంక్షలు:ఏపీ సీఎం చంద్రబాబు
నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. పవిత్రమైన ఈ పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:
ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు భూలోకానికి చేరి, ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చే ఈ పరమ పవిత్రమైన రోజున, ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను.
మంత్రి నారా లోకేష్:
శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూమిపైకి వచ్చే పుణ్యదినం ముక్కోటి ఏకాదశి. ఈ రోజున వైకుంఠం ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ వైకుంఠ ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మాజీ సీఎం జగన్:ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.