రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు నూతన  నిబంధనలు

Spread the love

రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు నూతన  నిబంధనలను ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదును తప్పనిసరి చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పుట్టిన/మరణించిన తేదీ నుంచి 21-30 రోజుల్లోపు నమోదు చేస్తే రూ.25 అపరాధ రుసుము  చెల్లించాలి. 30 రోజుల తర్వాత నుంచి ఏడాది లోపు నమోదు చేయాలంటే జిల్లా రిజిస్ట్రార్ పర్మిషన్ తో పాటు రూ.250 అపరాధ రుసుము కట్టాలి. బిడ్డ పుట్టినప్పుడు పేరు నమోదు చేయకపోతే.. 12 నెలలలోపు ఉచితంగా పేరు నమోదు చేసుకోవచ్చు. ఏడాది దాటితే రూ.250 అపరాధ రుసుము చెల్లించాలి. జనన/మరణాల నమోదు సంవత్సరం దాటితే జిల్లా మేజిస్ట్రేట్ లేదా ఆర్డీవో ఆదేశాలు తప్పనిసరి అలాగే దీంతోపాటు ఆలస్యానికి అపరాధ రుసుము రూ.500 కట్టాలని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *