కొలంబోలో జరిగిన భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ కి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ ధనం వెచ్చించి వెళ్లారనే వార్త లో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి నారా లోకేష్ పర్యటన కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి అసత్య వార్తలు నమ్మవద్దని పేర్కొంది. కాగా, ఈ అసత్య ప్రచారంపై మంత్రి లోకేష్ కూడా సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా అంటూ లోకేష్ వ్యంగ్యంగా తన ‘ఎక్స్’ పోస్ట్ లో పేర్కొన్నారు. తన పోస్ట్ ను వై.ఎస్.జగన్ ను ట్యాగ్ చేశారు.