బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా ఏపీలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది. ఇది భారత్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
నేడు, NHAI, మెసర్స్ రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G) పై కేవలం 24 గంటల్లో 28.95 లేన్ కిలోమీటర్ల మేర 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీటును నిరంతరాయంగా వేసి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది. ఈ అసాధారణ విజయం భారత ప్రభుత్వ దార్శనికతకు, నితిన్ గడ్కరీనాయకత్వంలో ప్రపంచ స్థాయి రహదారి మౌలిక సదుపాయాల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, ఇంజనీర్లు, కార్మికులు మరియు ఫీల్డ్ టీమ్‌ల అసాధారణ నిబద్ధతకు ఇది ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ పనులన్నీ NHAI నిర్దేశించిన అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించబడినట్లు పేర్కొన్నారు. ఈ మైలురాయి వంటి కారిడార్‌లోని ప్యాకేజీ 2 & 3 లలో, జనవరి 11, 2026 నాటికి మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డుల కోసం ప్రయత్నిస్తున్న టీమ్ కు చంద్రబాబు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశం నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అందిస్తోంది అంటూ ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.