ఆస్ట్రేలియన్ ఓపెన్ లో దూసుకుపోతున్న సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్

Spread the love

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెర్బియన్  టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ దూసుకుపోతున్నాడు. 25వ గ్రాండ్ స్లామ్  పై గురిపెట్టిన ఈ టెన్నిస్ స్టార్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ జకోవిచ్ 6-3, 6-3, 6-2తో ఇటలీకి చెందిన  ఫ్రాన్సిస్కో మాస్టైల్లిపై విజయం సాధించాడు. జకోవిచ్ కెరీర్లో ఇది 399 వ గ్రాండ్లమ్ విజయం. ఇక ఇటలీ ఆటగాడు రెండో సీడ్ సినర్  6-1, 6-4, 6-2తో ఆస్ట్రేలియాకు చెందిన  డక్ వర్త్ పై విజయం సాధించాడు. మాజీ ఛాంపియన్ స్విట్జర్లాండ్ కు చెందిన  స్టానిస్లాస్ వావ్రింకా అతి కష్టంగా రెండో 4-6, 6-3, 3-6, 7-5, 7-6 (10-3)55 ఫ్రాన్స్ కు చెందిన  గియాపై గెలిచాడు. అయిదో సీడ్ ఇటలీకి చెందిన ముసెటి 6-3, 6-3, 6-4తో సొనెగో, 12వ సీడ్ నార్వేకు చెందిన  రూడ్ 6-3, 7-5, 6-4తో మునార్ (స్పెయిన్)పై, 8వ సీడ్ షెల్టన్ (అమెరికా) 6-3, 6-2, 6-2తో స్వీనీ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. సిట్సిపాస్ (గ్రీస్) 4-6, 6-3, 6-7 (5-7), 6-7 (5-7) (35) కంగుతిన్నాడు.కెరీర్ గ్రాండ్గామ్ లక్ష్యంగా బరిలో దిగిన పోలెండ్ స్టార్ ఇగా స్వైటెక్ మహిళల సింగిల్స్  లో మూడో రౌండ్ చేరింది. రెండో రౌండ్లో స్వైటెక్ 6-2, 6-3తో బజ్కౌవా (చెక్)పై విజయం సాధించింది. జపాన్ టెన్నిస్ స్టార్ ఒసాకా కూడా 6-3, 4-6, 6-2తో క్రిస్టియా (రొమేనియా)పై గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-1, 7-5తో క్రూగర్ (అమెరికా)పై గెలుపొందగా.. ఆరోసీడ్ పెగులా (అమెరికా) 6-0, 6-2తో కెస్లెర్ (అమెరికా) 5వ  సీడ్ రిబకినా (కజకిస్థాన్) 7-5, 6-2తో గ్రెచెవా (ఫ్రాన్స్)పై, నాలుగో సీడ్ అనిసిమోవా (అమెరికా) 6-1, 6-4తో సినియాకోవా (చెక్)పై నెగ్గారు. మాజీ నంబర్ వన్ రష్యాకు చెందిన  ప్లిస్కోవా 6-4 6-4తో పోలాండ్ కు చెందిన  టెజెన్ పై గెలిచింది.