ప్రొద్దుటూరులో గురువు వర్సెస్ శిష్యుడు..!

Spread the love

Proddatur Rachamallu vs Varadarajulu: అవినీతి నిర్మూలిస్తానంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అవినీతి అధికారులను వదిలిపెట్టేదె లేదని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకశాలు కల్పిస్తానంటూ ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్… చెప్పింది ఒకటి చేస్తున్నదొకటి. ఇంతకీ ఎవరా ఎంఎల్ఏ. వాచ్ దిస్ స్టోరీ.

వ్యాపార వాణిజ్య కేంద్రంగా ప్రసిద్దిగాంచిన ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో రెండవ ముంబైగా ప్రసిద్ది. అంతే కాదు ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలను రెండవ మైసూర్ తో పోలుస్తారు. కడప పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గం రాయలసీమలో కీలకమైంది. గత ఎన్నికల్లో ఒకప్పటి గురుశిష్యులైన రాచమల్లు ప్రసాద్ రెడ్డి, వరద రాజుల రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి 1985 నుంచి 2004 వరకు వరుసగా అయిదు సార్లు గెలుస్తూ వచ్చారు. 2014లో టిడిపి తరపున పోటీ చేసిన వరదరాజుల రెడ్డి తన శిష్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక రాచమల్లు వరుసగా రెండు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై వరదరాజుల రెడ్డి గెలుపొందారు. రాచమల్లు హయాంలో ఆయన బావమరిది బంగారు రెడ్డి, షాడో ఎమ్మెల్యే గా వ్యవహరిస్తూ అరాచక శక్తులను ప్రోత్సహించారనే విమర్శలు అప్పట్లో సంచలనంగా మారాయన్న టాక్ ఉంది. ఆయన కనుసన్నుల్లోనే మట్కారాయుళ్లు చెలరేగి పోయినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. Proddatur Rachamallu vs Varadarajulu.

గత ఎన్నికల సమయంలో రాచమల్లు అవినీగి చరిత్ర అంటూ చెప్పుకొచ్చిన వరదరాజులురెడ్డి, తాను గెలిచిన తర్వాత అన్నింటికీ చెక్ పెడతానని హామీ ఇచ్చారు. ఇప్పుడు గెలిచిన ఏడాది పూర్తి అయినా మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. అటు రాచమల్లు కూడా ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారట. తనపై మోపిన అభియోగాల్లో ఒక్కటైనా రుజువు చేయాలని సవాల్ విసురుతున్నారట. జనానికి మాయమాటలు చెప్పి గెలిచారంటూ వరదరాజులురెడ్డి మీద రెచ్చిపోతున్నారట రాచమల్లు. ఇక సిట్టింగ్ ఎంఎల్ఏ కేడర్ కూడా మట్కా రాయుళ్లతో చేతులు కలిపారన్న ఆరోపణలు కూడా నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి.

కడప జిల్లాలోని ఈ నియోజకవర్గం చాలా కీలకమైంది. ఇక్కడ రాజకీయం జిల్లాపై ప్రభావం చూపుతుందన్న టాక్ ఉంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, సవాళ్లతో ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం మళ్లీ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ముందు ముందు ఎలాంటి రాజకీయ పరిస్తితులు ఏర్పడతాయన్నదే ఇప్పుడు తేలాల్సి ఉందని ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ జనం చెబుతున్న మాట.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/ap-cid-targets-ycp-mp-mithun-reddy-for-liquor-case-policy-as-it-is-in-early-stage/