తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం..అసలు దోషులను తేల్చేందుకు విచారణ కమీషన్

Spread the love

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక నేటి సమావేశంలో కల్తీ లడ్డు వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు దోషులను పట్టుకునేందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిట్ నివేదికపైనా ఈ సమావేశంలో చర్చించింది. ఆ నివేదికలో పాత్రదారులపైనే చర్యలకు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయపడింది. సిట్ విచారణ, ఛార్జ్ షీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను కేబినెట్ గుర్తించింది. ఈ మూడు అంశాలపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమీషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.