ఈ ఏడాది సంక్రాంతికి సినీ సందడి ప్రేక్షకులను అలరించింది. వచ్చే ఏడాది కూడా అంతకుమించి ఉండే విధంగా ఇండస్ట్రీ నుండి సినిమాలు రానున్నాయి. సీనియర్ అగ్రకథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల సినిమాలు సంక్రాంతి సీజన్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో రానున్న చిత్రం, బాలకృష్ణ-గోపీచంద్ మలినేని, వెంకటేష్-అనిల్ రావిపూడి అలాగే నాగార్జున సినిమా గురించి కూడా అన్నపూర్ణ సంస్థ ప్రకటన ఇచ్చేసింది. వాసివాడి తస్సాదియ్యా వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా డేట్ మార్క్ చేసుకోండి అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వంటి ఇతర వివరాలను ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన అన్ని చిత్రాలు మంచి వసూళ్లను అందుకున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అత్యధిక వసూళ్లతో రికార్డు సృష్టించింది. రీజనల్ చిత్రాలతోనే అత్యధిక కలెక్షన్స్ తో నెంబర్ వన్ గా నిలిచింది.