బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ రూ.1తో అన్‌ లిమిటెడ్ కాల్స్..!

Spread the love

BSNL Freedom Plan: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్‌ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్ పేరుతో దీనిని రీసెంట్‌గా అయితే లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా కేవలం రూ.1కే, 30 రోజుల అపరిమిత సేవలను అందిస్తుండటం విశేషం. కాకపోతే ఎక్సిజిస్టెడ్‌ కస్టమర్స్‌కి వర్తించదు.

కేవలం ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందన్నమాట. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ ఎక్స్ ద్వారా తెలిపింది. ఈ ప్లాన్‌ రూ.1కే ఆఫర్‌లో దొరుకుతుండగా, 30 డేస్‌ అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డైలీ 100 ఎస్‌ఎంఎస్‌లు అలానే 2జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. సిమ్ కూడా ఫ్రీ ఇస్తోంది. ఈ ఆఫర్ ఆగస్టు1 నుంచి 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. BSNL Freedom Plan ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్ కోసం దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) కు లేదా రిటైలర్‌ను కాంటాక్ట్‌ అవ్వొచ్చు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, 4జీ సేవలను విస్తరించడమే లక్ష్యంగా సంస్థ ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి కొత్త యూజర్స్ ఈ ఆఫర్ ను త్వరగా గ్రాబ్‌ చేసుకోగలరు.

Also Read: https://mega9tv.com/national/these-are-the-jobs-that-will-soon-disappear-due-to-ai-key-points-in-microsoft-survey/