సుబ్ర‌హ్మ‌ణ్యం గారి కృషి ప్ర‌శంస‌నీయం:ఏపీ మంత్రి లోకేష్

Spread the love

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల‌కు సైన్స్ విద్యపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ 30 ఏళ్లుగా చేస్తున్న కృషికి గానూ నెల్లూరు జిల్లా చెముడుగుంట సైన్స్ సెంటర్ క్యూరేటర్ ఎన్. సుబ్రహ్మణ్యం గారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్.డి. షిబులాల్ SFPI, ‘శిక్షాలోక్’ సంస్థల “శిక్షాగ్రహ లీడర్‌షిప్ అవార్డు” అందుకున్న సంద‌ర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ అభినంద‌న‌లు తెలిపారు. దేశవ్యాప్తంగా 6,500 మంది ఉపాధ్యాయులలో ముగ్గురిని ఎంపిక చేయ‌గా అందులో ఒక‌రు మ‌న సుబ్రహ్మణ్యం గారు కావ‌డం మ‌న రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణమని పేర్కొన్నారు. విద్యాశాఖ స‌హ‌కారంతో మొబైల్ సైన్స్ ల్యాబ్ (స్పేస్ ఆన్ వీల్స్), ఇండోర్, అవుట్‌డోర్ ఎగ్జిబిట్‌లను పునరుద్ధరించి, వాటికి QR కోడ్‌లు, వీడియో వివరణలను జత చేయడం, ఆస్ట్రో టూరిజం, కాస్మోస్ డిజిటల్ లెర్నింగ్,  STEM ఆధారిత ప్రయోగాత్మక అభ్యాసం అమలు చేయడం, ‘బడ్డింగ్ సైంటిస్ట్స్’, ఇన్‌స్పైర్ (INSPIRE) అవార్డ్స్, రూరల్ చిల్డ్రన్ రీసెర్చ్ సెంటర్ నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుబ్ర‌హ్మ‌ణ్యం గారి కృషి ప్ర‌శంస‌నీయమని ‘ఎక్స్’ లో లోకేష్ పేర్కొన్నారు.