చేనేత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యం: అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం

Spread the love

చేనేత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా… వారి కష్టానికి తోడుగా నిలబడేందుకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను హామీగా కాకుండా బాధ్యతగా తీసుకుని నేడు ప్రభుత్వం చేనేత సోదరుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.  మగ్గం ఆడితేనే ఇంట్లో దీపం వెలిగే నేతన్నల కష్టాన్ని అర్థం చేసుకుని ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. 93 వేల చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఈరోజు నుండి  అమల్లోకి వస్తోందని  విద్యుత్‌ను రాయితీగానే కాకుకుండా ఒక్కో నేతన్న కష్టానికి ఇస్తున్న గౌరవం వారి వృత్తికి కలిగిస్తున్న భరోసా అని తెలిపారు. ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చవుతున్నప్పటికీ నేతన్నల చిరునవ్వే తమ ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.8 వేల నుంచి రూ.21 వేల దాకా ఆదా కలిగించడంతో పాటు వారి జీవన స్థాయిని మెరుగుపరచేందుకు వేసిన కీలక నిర్ణయమని అన్నారు.  చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా బ్రాండ్ కల్పిస్తూ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.  మగ్గం దగ్గర కూర్చుని జీవితాన్ని నెట్టుకొస్తున్న ప్రతీ నేతన్న నేస్తున్నది కేవలం వస్త్రం కాదని  మన సంస్కృతి అని ఇది ప్రభుత్వం చెబుతున్న మాటని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *