స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలి:అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

Spread the love

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. కందులవారిపల్లి, చిన్న రామాపురం,  రంగంపేట గ్రామాలను కలిపి స్వర్ణ నారావారిపల్లికి కార్యక్రమానికి ఎంపిక చేసి… ప్రత్యేక ప్రాజెక్టు అమలు ద్వారా ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు.  అన్ని ఇళ్లకూ వంద శాతం సోలార్  ప్యానెళ్లను అమర్చడం, శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమను ప్రోత్సహించడం, ప్రకృతి సేద్యం విస్తరణ తదితర ప్రణాళికల ద్వారా స్థానికుల తలసరి ఆదాయం 20 శాతం మేర పెరిగిందని వివరించారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో చంద్రగిరి మండలం అంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలని.. నిర్దేశించుకున్నరిజల్స్ట్ ను ఏడాదిలోపు సాధించాలని అధికారులకు సూచించారు. స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు అమలుతో ఏడాదిలో ఈ మండలంలోని ఆయా గ్రామాల ప్రజల జీవనప్రమాణాలు మెరుగు పడే పరిస్థితిని తీసుకువస్తామని స్పష్టం చేశారు.