శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాల చిన్నారులు శ్రీరామనవమి సందర్భంగా ప్రదర్శించిన నృత్యరూపకం రామాయణంను తన కళ్ల ముందుంచిందని కొనియాడారు. దీనికి సంబంధించి చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనను ఆయన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ లవకుశ సినిమాని ఈ ప్రదర్శన గుర్తుకు తెచ్చిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా రామాయణంలో ముఖ్యఘట్టాలను 5 నిమిషాల్లో ప్రదర్శించిన హిరమండలం మండలం గులుమూరు ఎంపీపీఎస్ స్కూలు విద్యార్థులు వంజరాపు ప్రవశ్య (6వ తరగతి), కీర్తి హరిదీప్ (3వ తరగతి), కీర్తి హైందవి ప్రియ (2వ తరగతి), కొత్తపల్లి రోషన్ (1వ తరగతి), శనపతి శివకుమార్ (1వ తరగతి), ఓలక నవ్యశ్రీ (3వ తరగతి), జర్జాన సుస్మిత (4వ తరగతి), ఇనుముల గీతిక (3వ తరగతి), బెవర లిఖిత (1వ తరగతి), గంథం సింధూజ (1వ తరగతి), టంకాల బేబీరాణి (5వ తరగతి), సిగడాన నవ్యశ్రీ (4వ తరగతి), కొరయ్య జోషిత (4వ తరగతి), పొట్నూరు ఇందుశ్రీ (4వ తరగతి)లకు ప్రేమపూర్వక ఆశీస్సులు తెలిపారు. రామచరితం పేరుతో ఈ ప్రదర్శనను రూపొందించి పర్యవేక్షించిన ఎస్టీజీ జిన్నాడ పార్వతి గారికి, ప్రోత్సహిస్తున్న ఎంఈవో సుంకు దాలయ్య గారికి అభినందనలు తెలిపారు.