తమిళనాడులో ‘పేపర్ లెస్’ రిజిస్ట్రేషన్ సేవలు

Spread the love

రిజిస్ట్రేషన్ శాఖలోని ప్రజా సేవలను పూర్తిస్థాయిలో పేపర్ లెస్ గా మార్చేందుకు తమిళనాడు సర్కారు డిజిటల్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. ఈమేరకు సీఎం స్టాలిన్ ‘స్టార్ 3.0 స్ప్రింట్ 1’ టెక్నాలజీని ప్రారంభించారు. ఆధార్ కార్డు ఓటీపీ, బయోమెట్రిక్ అథెంటికేషన్ తో మొదటి విడతగా 28 రకాల సేవలను పొందే ఏర్పాట్లు చేశారు. భూముల రిజిస్ట్రేషన్లను ఆధార్ వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత సబ్ రిజిస్ట్రార్ సంతకంతో రిజిస్టర్ అయ్యే విధంగా, ఆన్ లైన్ ద్వారా ఎలెక్ట్రానిక్ డాక్యుమెంట్ పొందేలా చేస్తున్నారు. పర్మిషన్ పొందిన లే ఆవుట్స్ లో ప్లాట్స్ సెల్లర్స్ మరియు బయ్యర్లు ఆన్ లైన్ లోనే డాక్యుమెంట్స్ సమర్పించి, ఆన్ లైన్ పే మెంట్లు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ పొందే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.