మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది:మంత్రి నారా లోకేష్

Spread the love

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం  తల్లిని అవమానించారు. సీఎం  తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ మండలి వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయేల్ ఆరోపణలను మంత్రి లోకేష్ ధీటుగా బదులిచ్చారు.  ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం గారి తల్లిని అవమానించారు  అవునా, కాదా సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు వినియోగించిన పదాలను ఒక్కసారి గమనించాలి. మహిళలను మనం గౌరవించాలి. ఆ బాధ్యత మనందరిపై ఉంది. హౌస్ లోపల, బయట మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మా సొంత కార్యకర్త వైఎస్ భారతీరెడ్డి గురించి మాట్లాడితే.. తక్షణమే చర్యలు తీసుకున్నాం. జైలుకు పంపించాం. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మహిళలను కించపరిచే పదాలు వాడకూడదు. అలాంటివి పోత్సహించవద్దని కోరుతున్నా. మేం ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదని లోకేష్ స్పష్టం చేశారు. మాకు బాధ్యత ఉంది. మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు. జగన్ రెడ్డి తల్లిగారైనా, ఎవరి తల్లైనా, చెల్లైనా, అక్కైనా.. ఎవరి గురించైనా మాట్లాడితే ప్రజాప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మా సీఎం, డిప్యూటీ సీఎం చెప్పారని లోకేష్ పునరుద్ఘాటించారు.