దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగించాయి. వరుసగా ఐదవ రోజు కూడా నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు అమ్మకాలు ప్రభావం చూపాయి. గడిచిన ఐదు సెషన్లలో సెన్సెక్స్ 2200కు పైగా పతనమైంది. నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 604 పాయింట్ల నష్టంతో 83,576 వద్ద ముగిసింది. నిఫ్టీ 193 పాయింట్ల లాభంతో 25,683 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.14 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ లో అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, బీఈఎల్,ఎటెర్నల్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.