ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (Naa Anveshana) ఫేమ్ అన్వేష్‌పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఆయన సోషల్ మీడియా కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించారు.అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ వివరాలు, ఐపీ అడ్రస్ , ఇతర లాగిన్ సమాచారాన్ని అందించాల్సిందిగా కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారు.విదేశాల్లో ఉంటూ వీడియోలు చేస్తున్న అన్వేష్‌ను గుర్తించేందుకు ఈ సాంకేతిక వివరాలు కీలకం కానున్నాయి.
నటుడు శివాజీ – ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను విమర్శించే క్రమంలో, అన్వేష్ సీతాదేవి ,ద్రౌపది వంటి పౌరాణిక పాత్రల గురించి అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదులు అందాయి.సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు BNS సెక్షన్లు 352, 79, 299 మరియు ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు.ఇదే విషయమై ఖమ్మం , విశాఖపట్నంలో కూడా ఆయనపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.ఈ వివాదం కారణంగా సోషల్ మీడియాలో అన్వేష్ లక్షలాది మంది ఫాలోవర్లను కోల్పోగా, హిందూ సంఘాలు ఆయనను భారత్‌కు రప్పించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.