ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై NIELITతో ఒప్పందం

Spread the love

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచ క్వాంటం-ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ-NIELITతో ఒప్పందం చేసుకుంది. దక్షిణ భారత్ లో మొట్టమొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ ను ఏర్పాటు చేసేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రణాళిక. కేంద్రం నుంచి మౌలిక సదుపాయాలకు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి, క్వాంటం హార్డ్‌వేర్ సమకూర్చేలా ఒప్పందం చేసుకుంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ లో నేషనల్ హబ్ గా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న NIELIT డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి, కంట్రోలర్ జనరల్ డాక్టర్ అలోక్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *