పెరూ దేశ అధ్యక్షుడిగా మాజీ జడ్జి జోస్ మారియా బల్కజార్

Spread the love

పెరూ దేశ అధ్యక్షుడిగా మాజీ జడ్జి జోస్ మారియా బల్కజార్(83) ఎన్నికయ్యారు. 130 మంది సభ్యులున్న పెరూ కాంగ్రెస్ (చట్టసభ) ఫిబ్రవరి 18న జరిగిన ఓటింగ్‌లో బల్కజార్‌ ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆయన తన ముగ్గురు ప్రత్యర్థులను ఓడించి మెజారిటీ సాధించారు.గత 10 ఏళ్లలో పెరూకు ఈయన 8వ అధ్యక్షుడు. దేశంలో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభానికి ఇది నిదర్శనం. అవినీతి ఆరోపణలతో తాత్కాలిక అధ్యక్షుడు జోస్ జెరీని తొలగించిన మరుసటి రోజే ఈ ఎన్నిక జరిగింది. వామపక్ష పెరూ లిబ్రె పార్టీ తరఫున పోటీ చేసిన బల్కాజార్ విజేతగా నిలిచారు. పెరూలో బల్కజార్ కేవలం తాత్కాలిక (Interim) అధ్యక్షుడిగా మాత్రమే కొనసాగుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న జరగబోయే సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *