మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్‌పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో సత్తెనపల్లిలో లక్కీ డ్రా టిక్కెట్ల కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు. పోలీసు వ్యాన్ గుంటూరు కోర్టు వద్దకు చేరుకున్న తర్వాత వాహనం దిగడానికి ముందు అంబటి రాంబాబు తనదైన స్టైల్ లో హావ భావాలూ పలికించారు. ఇక ఆయనను జైలుకు తీసుకువస్తున్న నేపథ్యంలో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబు గత నెల 31వ తేదీ నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టిక్కెట్లు అమ్మకాలపై సత్తెనపల్లి పి యస్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు.