మీ హయాంలో విశాఖకు ఒక్క కంపెనీ తెచ్చారా?వైసీపీపై మంత్రి లోకేష్ విమర్శలు

Spread the love

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇండస్ట్రీలకు భూ కేటాయింపులపై జరిగిన చర్చలో లోకేష్ వైసీపీ పై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా వైసీపీ కుట్రలు చేసిందని విమర్శించారు. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ కేటాయింపులు అంటూ వైసీపీ చేసిన ఆరోపణలపై లోకేష్ ధీటుగా స్పందించారు. ఆధారాలు లేకుండా విమర్శిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. క్రెడిబిలిటీ ఉన్న   సంస్థలకే భూములు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలనే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. ఆర్సెలార్ మిట్టల్ కంపెనీ ఉత్తరాంధ్రకు రానుందని దానికి భూములు కేటాయించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క విశాఖకు ఒక్క కంపెనినైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. వైసీపీకి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఏపీలో భూములు పొందిన ఐదు కంపెనీల నుంచి ఒక్క కప్ కాఫీ తప్ప ఏదైనా తీసుకున్నట్లు వైసీపీ నిరూపించగలదా?  నేను రెడీగా ఉన్నా అంటూ సవాల్ చేశారు.