ఆర్టీసి బస్సునే ఎత్తుకెళ్లిన దొంగ

నర్సీపట్నం

సర్సీపట్నం ఆర్టీసి డిపో నుంచి తుని వెళ్లాల్సిన ఆర్టీసి అద్దె బస్సును ఆదివారం అర్ధరాత్రి చోరీకి గురైంది. ఈ బస్సు ఉదయం 4.30 గంటల సమయంలో సర్సీపట్నం నుంచి తుని వెళ్లాల్సి ఉoది. ఆర్టీసి డిపో ఆవరణలో బస్సును నిలిపి ఉంచారు. ఉదయం ఈ అద్దె బస్సును తీసుకొని తుని వెళ్లాల్సిన డ్రైవర్ డ్యూటీ సమయానికి డిపో వద్దకు వచ్చి చూడగా బస్సు కనిపించలేదు. పార్కింగ్ లో ఉండాల్సిన ఈ బస్సు కనిపించకపోవడంతో బస్సు యజమాని దాట్ల గీతంరాజకు తెలియజేశారు. వెంటనే నర్సీపట్నం టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. స్పందించిన టౌన్ సిఐ గోవిందరావు రెండు టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అని తేలింది వెంటనే అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చి బస్సు తో పాటు డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సమీపంలోని చింతలూరు వద్ద చోరీ కి గురైన బస్సు పట్టుబడింది. బస్సు తో పాటు చోరీ చేసిన దొంగను సర్సీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బస్సు చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బస్సు రికవరీ జరిగిందని, దొంగ కూడా తమ అదుపులో ఉన్నాడని, టౌన్ సిఐ గోవిందరావు విలేకరులకు వెల్లడించారు. పూర్తిస్థాయి వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తామని చెప్పారు.

apsrtc bus stolen in narsipatnam and later recovered