కేంద్రం కీలక నిర్ణయం…క్యాన్సర్ మెడిసిన్ ధరల తగ్గింపు అమలు

నాణ్యమైన వైద్యాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ చేయడం ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థకు నిదర్శనం. 1364 క్యాన్సర్ నిరోధక మెడిసిన్స్ ధరలు తగ్గాయి. నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్.పి.పి.ఏ) 137 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్లను పరిమితం చేసినట్లు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. సవరించిన కొత్త ధరలను రిటైలర్స్, హాస్పిటల్స్, డీలర్స్ వారి వారి ప్రాంగణాలలో, వెబ్ సైట్లలో పెట్టాలని ప్రభుత్వం ఆశించింది. ఈ రూల్స్ అమలవుతున్నది లేనిది రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు పర్యవేక్షించనున్నారు. దాదాపు 137 రకాల క్యాన్సర్ నివారణ ఔషధాల ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది అనేక కుటుంబాలకు ఊరటనివ్వడమే కాకుండా, వారిలో జీవితం పట్ల కొత్త ఆశను చిగురింపజేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ప్రాణాంతక వ్యాధులకు వాడే మందుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. దీనివల్ల ఎంతోమంది ఆర్థిక భారంతో చికిత్సను మధ్యలోనే నిలిపివేయడం లేదా ఆస్తులు విక్రయించి అప్పులపాలవడం జరుగుతుండేది. ఇప్పుడు ఈ ఔషధాల ధరలు అందుబాటులోకి రావడం వల్ల, ఎటువంటి నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా రోగులు తమ చికిత్సను పూర్తిస్థాయిలో కొనసాగించే వీలు కలిగింది. ఇది పేద మరియు మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేకూరుస్తుంది.ఆర్థిక సడలింపు రోగులకు కేవలం డబ్బు ఆదా చేయడమే కాక, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతుంది. క్యాన్సర్ పై పోరాటంలో ఔషధాలతో పాటు రోగి యొక్క ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యం. వైద్యం మనకు అందుబాటులోనే ఉంది అనే భావన వారిలో ఒత్తిడిని తగ్గించి, త్వరగా కోలుకోవడానికి అవసరమైన సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. మానసిక ప్రశాంతత వారి ఆరోగ్య స్థితి మెరుగుపడటానికి ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ నిరోధక మెడిసిన్ ధరలు తగ్గడం వలన పేషంట్లకు రూ.3,540.38 కోట్లు ఆదా అవనున్నాయి. 670 బ్రాండ్ లలో సగానికి పైగా తగ్గనున్నాయి. నాణ్యమైన వైద్యాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ చేసే దిశగా ఈ నిర్ణయం ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 137 రకాల మందుల మూల్యాలను నియంత్రించడం ద్వారా ప్రభుత్వం ప్రాణరక్షణకు ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టమవుతోంది. ఈ నిర్ణయం బాధితుల కుటుంబాల్లో ధైర్యాన్ని నింపడమే కాక, ఆర్థిక అడ్డంకులు లేని సమగ్ర ఆరోగ్య సమాజ నిర్మాణానికి బలమైన తోడ్పాటు దక్కనుంది. ఎన్.పి.పి.ఏ వెబ్ సైట్ లో ధరలు చూసుకుని ఎక్కడైనా తేడాగా అనిపిస్తే 1800-111-255 హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా కంప్లైంట్ చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.



