జైలర్ 2 ఓటీటీకి వచ్చేస్తోంది..30 నిమిషాల అన్‌కట్ వెర్షన్ తో మాస్ జాతరే!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి అత్యధిక వసూళ్లు సాధించిన మొట్టమొదటి తమిళ చిత్రంగా రికార్డులకెక్కింది. ట్రేడ్ వర్గాల నుండి వచ్చిన అప్డేట్ ను బట్టి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. కేవలం ఇండియాలోనే ఈ మూవీ రూ.541 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్ మార్కెట్ లో 275 కోట్లు కొల్లగొట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీని నవంబరు 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏకంగా ఐదు భాషల్లో.. అంటే తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రైమ్ వీడియో ట్విట్టర్ వేదికగా ఒక స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేసుకుంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ తిరిగి వస్తున్నాడు. రీ లోడెడ్ నవంబరు 12న జైలర్ 2 అమెజాన్ప్రైమ్లో అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లో రిలీజ్ అయిన వర్షనే ఓటీటీలో వస్తుంది. మహా అయితే ఒకట్రెండు డిలీటెడ్ సీన్స్ కలుపుతారు. కానీ జైలర్ 2 విషయంలో ఓటీటీ వ్యూవర్స్ కోసం మేకర్స్ ఒక పెద్ద స్కెచ్ వేశారు. ఈ మూవీ అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమింగ్కు తీసుకొచ్చే అవకాశం ఉందని కోలీవుడ్‌లో బలంగా టాక్ వినిపిస్తోంది.నిజానికి ప్రస్తుతం థియేట్రికల్ వెర్షన్ రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలు ఉంది. సినిమా లెంగ్త్ ఎక్కువవుతుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కొన్ని అదిరిపోయే సీన్స్ ను థియేటర్స్ కోసం కట్ చేశాడు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం అదనంగా ఆ 30 నిమిషాలను జోడిస్తారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ 30 నిమిషాల సీన్స్ లో ఎవరెవరు ఉంటారో తెలిస్తే మీకు పూనకాలు గ్యారెంటీ. స్టార్ కమెడియన్ సంతానం, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి , బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కు సంబంధించిన హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ అన్‌కట్ వెర్షన్ లో ఉండబోతున్నాయట. ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం రజనీకాంత్ మాస్ అప్పీల్, నెల్సన్ టేకింగ్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు.. ఇందులో నటించిన హ్యూజ్ స్టార్ కాస్ట్. ఒక ప్యాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడం కోసం డైరెక్టర్ నెల్సన్ ఇందులో ఎస్.జే సూర్య , మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడి లాంటి హేమాహేమీలను తీసుకున్నాడు. ఇక క్యామియో రోల్స్ లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ తో పాటు హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లాయి. ఎన్ని సినిమాలు వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర రజనీకాంత్ స్టైల్ అండ్ స్వాగ్ కు ఉన్న క్రేజ్ ఏంటో జైలర్ 2 మరోసారి నిరూపించింది. థియేటర్లలో ఈ మ్యాజిక్ ను మిస్సయిన వాళ్లు, అలాగే ఆ 30 నిమిషాల ఎక్స్ట్రా సీన్స్ చూడాలనుకునే వాళ్లు నవంబర్ 12 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



