గెస్ట్ లిస్ట్‌లో ఆ హీరో పేరు లేదా?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు ప్రముఖ బిజినెస్ పర్సన్ కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. నవంబర్ 10, 11న గ్రీస్‌లో వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది. ఈరిసెప్షన్ కు ఇప్పటికే ప్రధానితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వాన పత్రికలు వెళ్లాయి.
అనిరుధ్ వివాహానికి సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతోంది. కోలీవుడ్‌కు చెందిన దాదాపు అందరు ప్రముఖ నటీనటులకు అనిరుధ్ వివాహ ఆహ్వాన పత్రికలు అందుతున్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ, స్టార్ హీరో ధనుష్‌కు మాత్రం ఇంకా ఎలాంటి పెళ్లి పత్రిక అందలేదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే, ఈ విషయాలపై ఇప్పటివరకు అనిరుధ్ కుటుంబం నుంచి గానీ, ధనుష్ వైపు నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అనిరుధ్ వివాహ ఆహ్వానాల జాబితాలో ధనుష్ పేరు లేదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్ కుటుంబ నేపథ్యమేనని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అనిరుధ్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న సంగతి తెలిసిందే . రజనీకాంత్ భార్య లతకు అనిరుధ్ మేనల్లుడు. తన పెళ్లికి కచ్చితంగా రజనీకాంత్ ఫ్యామిలీ మొత్తం వస్తుంది. మరోవైపు గతంలో రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్.. 2022లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రజనీ ఫ్యామిలీ ఈవెంట్లలో ధనుష్ కనిపించడం పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో, తన పెళ్లిలో రజనీకాంత్ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో, వారి వ్యక్తిగత పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే అనిరుధ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని..అందుకే ధనుష్ ను ఈ ఈవెంట్ కు దూరంగా ఉంచారని తమిళ మీడియాలో రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.



