డిసెంబర్ బరిలో ముగ్గురు కింగ్స్…అభిమానులకు ట్రిపుల్ ధమాకా!

ఈ ఏడాది డిసెంబర్ బాక్సాఫీస్ దగ్గర అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. సినిమా అభిమానులకు క్రిస్మస్ కానుకగా ఏకంగా ముగ్గురు అగ్ర హీరోలు ఒకే రోజు థియేటర్లలో సందడి చేయనున్నారు. డిసెంబర్ 24 టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, నాగార్జున ఒకవైపు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోవైపు.. ఇలా మూడు భారీ చిత్రాలు ఒకే రోజు పోటీకి దిగడం సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారింది. బాలయ్య దాదా, నాగ్ 100వ చిత్రం కింగ్ 100, షారుఖ్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్ తో అదరగొట్టనున్నారు. డిసెంబర్ 24.. బాక్సాఫీస్ వద్ద ఈ తేదీ ఒక సరికొత్త రికార్డ్‌కు వేదిక కాబోతోంది. సిల్వర్ స్క్రీన్‌పై ఒకేసారి ఇద్దరు కింగ్స్ రానున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. వీరు వేర్వేరు భాషలకు చెందినవారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సరిగ్గా ఒకే రోజు థియేటర్లలో అడుగు పెట్టబోతున్నారు. మరింత విశేషమేమిటంటే, ఇదే రోజున నందమూరి బాలకృష్ణ దాదా తో బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో థియేటర్ల దగ్గర ట్రిపుల్ ధమాకా ఖాయమైంది.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కింగ్ 100. తమిళ దర్శకుడు రా. కార్తిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నాగ్ కెరీర్లో 100వ చిత్రం కావడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించే మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నాగ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. నాగ్ స్టైలిష్ లుక్, దేవి శ్రీ మ్యూజిక్ తో ఈ చిత్రం డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. నాగార్జున కింగ్ 100కి పోటీగా, బాలీవుడ్ నుంచి మరో కింగ్ వస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న కింగ్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. పఠాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ నటిస్తుండగా, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా రేంజ్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ కూడా సరిగ్గా డిసెంబర్ 24నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో షారుఖ్, నాగ్ మధ్య బాక్సాఫీస్ వార్ ఖాయమైంది.



