దిస్ టైమ్, ఇట్స్ నాట్ లవ్... కింగ్ 100 నుండి ఆసక్తికర అప్డేట్

తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ అగ్రహీరోలలో ఒకరిగా
ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు అక్కినేని నాగార్జున. కింగ్ 100.. ఇది నాగార్జున సినీ ప్రయాణంలో ఒక భారీ మైలురాయి. అన్నపూర్ణ స్టూడియోస్, టీ-సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాకు నూతన దర్శకుడు ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున బర్త్ డే రోజు రిలీజైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆసక్తికరమైన అంశం డి-ఏజింగ్ టెక్నాలజీ హాలీవుడ్ స్థాయిలో వాడుతున్న ఈ టెక్నాలజీ ద్వారా నాగార్జునను 25 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వయసు వరకు వివిధ దశల్లో చూపించబోతున్నారు.
డి-ఏజింగ్ టెక్నాలజీతో కుర్ర నాగార్జునను చూస్తే లేడీ ఫ్యాన్స్ కు మళ్లీ నిద్రపట్టదంతే. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో.. దానికి దీటుగా, పైచేయి సాధించేలా విలన్ క్యారెక్టర్ ఉండాలి. ఆ పవర్ ఫుల్ యాంటగోనిస్ట్ పాత్ర కోసమే బాలీవుడ్ నుంచి టబును రంగంలోకి దించారు. తాజాగా ఈ చిత్రబృందం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. హిట్ పెయిర్ టబు అండ్ నాగ్ రియూనైట్ వన్స్ అగైన్.. బట్ దిస్ టైమ్, ఇట్స్ నాట్ లవ్ ...అంటూ ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. అంటే వీరిద్దరూ ఈ సినిమాలో ప్రేమికులు కాదు, బద్ధ శత్రువులు అని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. ఈ సినిమాలో టబు ఎంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోందో చూపించడానికి నవంబర్ 4వ తేదీ, ఉదయం 9 గంటలకు టబుకు సంబంధించిన ఒక స్పెషల్, భయంకరమైన గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ తో సినిమా మీద ఉన్న అంచనాలు డబుల్ అవ్వడం ఖాయం. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కు ప్రాణం మ్యూజిక్. నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కింగ్ 100 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. టబుతో పాటు ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి , సుస్మితా భట్, విజయేంద్ర లాంటి పవర్ ఫుల్ కాస్టింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో, అంటే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో సైమన్ అనే పవర్ ఫుల్ విలన్ గా నటించి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న నాగార్జున.. ఇప్పుడు సోలోగా కింగ్ 100 తో క్రిస్మస్ బరిలో దిగుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



