నానికి జోడీగా కన్నడ బ్యూటీ..క్రేజీ కాంబో ఫిక్స్?
కామెంట్లు (0)

అంచెలంచెలుగా ఎదుగుతూ మాస్, క్లాస్, యాక్షన్, ఎమోషన్.. ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయగల ఏకైక నటుడు మన న్యాచురల్ స్టార్ నాని . సరిపోదా శనివారం, దసరా, హాయ్ నాన్న, ప్యారడైజ్ .. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా అంటే కేవలం ఫైట్లు, పాటలు మాత్రమే కాదు, గుండెల్ని పిండేసే ఎమోషన్స్ కూడా ఉండాలని నమ్మే నాని, ఇప్పుడు మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన ప్రేమకథతో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ మూవీలో నానితో రొమాన్స్ చేయడానికి హీరోయిన్ గా సౌత్ ఇండియాను తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫిదా చేసిన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్’ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన నాని ఈసారి మాస్, క్లాస్ రెండు సినిమాలను ఒకేసారి మొదలుపెట్టాడు. ఇప్పటికే సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియోని పట్టాలెక్కించిన నాని అది ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 96, ఇటీవలే సత్యం ,సుందరం చిత్రాలతో సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో నాని ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రేమకథలను అత్యంత సహజంగా, హృదయానికి హత్తుకునేలా తీయడంలో ప్రేమ్ కుమార్ ఆయనకు ఆయనే సాటి. భావోద్వేగాలను వెండితెరపై దృశ్యకావ్యాలుగా మలచడంలో ప్రేమ్ కుమార్ స్పెషలిస్ట్. ఇప్పుడు అలాంటి డైరెక్టర్, ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించగల న్యాచురల్ స్టార్ నాని కలిస్తే.. సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే.. దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసిన ఈ కథలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. కథను మలుపు తిప్పే విధంగా ఆ పాత్ర డిజైన్ చేశారని సమాచారం. నటనకు ఎంతో ఆస్కారం ఉన్న ఈ పాత్ర కోసం మేకర్స్ మొదట చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. కానీ ఫైనల్‌గా కన్నడ బ్యూటీ, టాలెంటెడ్ యాక్ట్రెస్ రుక్మిణీ వసంత్ పేరును ఖరారు చేసినట్లు లేటెస్ట్ టాక్. రుక్మిణీ వసంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ డబ్బింగ్ మూవీ సప్త సాగరాలు దాటి సినిమాలో ప్రియ క్యారెక్టర్ లో ఆమె పెర్ఫార్మెన్స్ కు, సహజమైన నటనకు సౌత్ ఇండియన్ ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. ఎలాంటి గ్లామర్ షో లేకుండా, కేవలం కళ్ళతోనే ఎమోషన్స్ పలికించగల సత్తా ఆమె సొంతం. ఆ తర్వాత రిషబ్ శెట్టితో కలిసి విజువల్ వండర్ కాంతార చాప్టర్ 1లో కూడా అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు నేరుగా తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన ఛాన్స్ కొట్టేయడం రుక్మిణీ కెరీర్‌కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.



