భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘రామాయణ’..ఆస్కార్ రేసులో కూడా..?

భారతీయ సినిమా విశ్వవ్యాప్తమవుతోంది. మన ఇతిహాసాలను ప్రపంచ స్థాయి టెక్నాలజీతో తీసి హాలీవుడ్ సినిమాలు కూడా మన ముందు తలవంచాల్సిందే అని రామాయణ: పార్ట్ 1 నిరూపించింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ క్వీన్ సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు కేవలం థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. ఏకంగా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేటలో దిగింది. మనదేశం నుంచి ప్రతి ఏడాదీ ఒక సినిమాను ఆస్కార్ అవార్డుల కోసం ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అధికారికంగా పంపుతారు. ఈ ఏడాది 99వ ఆస్కార్ అవార్డులకు భారతదేశ అధికారిక ఎంట్రీగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. మరాఠీ చిత్రమైన గొంధల్ ను ఎంపిక చేసింది. దీంతో రామాయణ సినిమాకు ఆస్కార్ ఛాన్స్ మిస్ అయిందని ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. అయితే అధికారిక ఎంట్రీ మిస్ అయితే అయినప్పటికీ జనరల్ కేటగిరీల్లో స్వతంత్రంగా దరఖాస్తు చేశారు. అంటే బెస్ట్ పిక్చర్ , బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ వీఎఫ్ఎక్స్ , బెస్ట్ యాక్టర్ లాంటి మెయిన్ కేటగిరీల్లో రామాయణ పోటీ పడబోతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అత్యుత్తమ హాలీవుడ్ చిత్రాలతో నేరుగా తలపడేందుకు రామాయణ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఆస్కార్ క్యాంపెయిన్‌ను లాంచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేటగిరీలో ఆస్కార్‌కు అర్హత సాధించాలంటే అకాడమీ కొన్ని అత్యంత కఠినమైన నిబంధనలు పెట్టింది. ఒక సినిమా బెస్ట్ పిక్చర్ రేసులో నిలవాలంటే.. ఆ సినిమాను అమెరికాలోని లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, అట్లాంటా, షికాగో, లేదా మయామి లాంటి నిర్దేశిత నగరాల్లో కనీసం 7 రోజుల పాటు కమర్షియల్ థియేటర్లలో ప్రదర్శించాల్సి ఉంటుంది. అది కూడా పెయిడ్ ఆడియన్స్‌కు రోజుకు కనీసం మూడు షోల చొప్పున ప్రదర్శించాలి. దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాతలు ఈ రూల్‌ను పక్కాగా ఫాలో అయ్యారు. అమెరికాలోని ఆయా నగరాల్లో రామాయణ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసి, అకాడమీ నిబంధనలకు అనుగుణంగా 7 రోజుల స్క్రీనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ స్క్రీనింగ్స్, బాక్సాఫీస్ లెక్కలు, రిపోర్టులతో సహా అవసరమైన మొత్తం డాక్యుమెంట్స్‌ను అకాడమీ బోర్డుకు సమర్పించారు. దీంతో రామాయణ జనరల్ కేటగిరీ ఎంట్రీ అధికారికంగా ఖరారైంది.ఈ సినిమాకు ప్రపంచంలోనే అత్యుత్తమ వీఎఫ్ఎక్స్ సంస్థ అయిన DNEG పనిచేసింది. ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డ్యూన్ లాంటి సినిమాలకు పనిచేసి ఏకంగా 8 సార్లు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సంస్థ ఇది. ఇక సంగీతం విషయానికొస్తే, ఈ సినిమాకు మ్యూజిక్ అందించింది ఇద్దరు ఆస్కార్ విజేతలు. హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ హన్స్ జిమ్మర్ , మన ఇండియన్ ప్రైడ్ ఏ.ఆర్. రెహమాన్ కలిసి ఈ ఎపిక్‌కు ప్రాణం పోశారు. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో వీళ్లద్దరి కాంబినేషన్ హాలీవుడ్ జ్యూరీ మెంబర్స్‌ను కచ్చితంగా ఆకర్షిస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.



