నాకు ఆ రకం అబ్బాయిలు…అస్సలు నచ్చరు..మనసు విప్పిన అనశ్వర రాజన్

టాలీవుడ్లో ఇప్పుడు మలయాళ హీరోయిన్స్ హవా నడుస్తోంది. రోషన్ మేకా హీరోగా నటించిన ఛాంపియన్ సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ అనశ్వర రాజన్. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన అనశ్వర, ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమాలో ఛాన్స్ పట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నవంబర్ 13న ఇట్లు అర్జున సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్న ఈ యంగ్ బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, ఇష్టాయిష్టాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. స్కూల్లో చదువుతున్నప్పుడు మోనో యాక్టింగ్ , స్కిట్స్‌లో పాల్గొనడం అనశ్వర హాబీ. కానీ ఎప్పుడూ సినిమాల్లోకి వెళ్లాలని కలలు కనలేదు. ఒకరోజు ఓ సినిమా ఆడిషన్స్ ప్రకటన చూసి, ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడంతో సరదాగా వెళ్లిందట. అప్పటికే అక్కడ ఆ పాత్ర కోసం సుమారు 6 వేల మంది ఆడిషన్స్ ఇచ్చారు. అంతమందిని దాటి వాళ్లు అనశ్వరను సెలెక్ట్ చేయడంతో ఆమెకు నమ్మశక్యం కాలేదు. అలా సరదాగా మొదలైన ప్రయాణం, ఈరోజు టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మార్చేసింది. రోషన్ మేకా హీరోగా నటించిన ఛాంపియన్ సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ, తన చూడచక్కని అందంతో కుర్రకారును ఫిదా చేసేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలానికే టాలీవుడ్ మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఏ హీరోయిన్ కైనా ఒక డ్రీమ్. చిరంజీవి తో కలసి కాకా సినిమాలో నటించడం తన లైఫ్‌లో ఒక బెస్ట్ ఫీలింగ్ అని అనశ్వర మురిసిపోతోంది. ఆయనది గొప్ప వ్యక్తిత్వం అని, సెట్లో ఇతరులతో ఎంతో హుందాగా వ్యవహరిస్తారని తాజా ఇంటర్వ్యూలో చెబుతోంది. అంత పెద్ద స్టార్ అయినా సరే, ప్రొఫెషనల్‌గా ఉంటూనే సెట్లో చాలా సరదాగా గడుపుతారని, ఆయన నుంచి యాక్టింగ్, డిసిప్లిన్ ఎంతో నేర్చుకోవచ్చని ఆమె తన సంతోషాన్ని పంచుకుంది.



