మెగా ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చే న్యూస్..RC17 లేటెస్ట్ అప్డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్. వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, చరణ్ నటనకు ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు వీరి కాంబోలో రాబోతున్న 17వ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాపై ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు దసరా పండుగ వేళ డబుల్ ధమాకా లాంటి అప్డేట్ వచ్చేసింది. పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ తో సుక్కు చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం ఆర్ సీ 17 ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్‌కు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోయింది. దసరా పండుగను పురస్కరించుకుని.. అక్టోబర్ 20న హైదరాబాద్‌లో చిత్ర బృందం పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం ఒక కొత్త ఆఫీస్‌ను కూడా సిద్ధం చేశారు. టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పెద్ది సినిమా కోసం కండలు పెంచుకున్న రామ్ చరణ్, RC17 కోసం స్పెషల్‌గా బరువు తగ్గి మరింత స్లిమ్ గా, లీన్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.
సినిమా లాంచ్ డేట్ న్యూస్ జోరుగా ఉన్న నేపథ్యంలో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంది. సుకుమార్ మూవీ అంటే వెంటనే దేవి శ్రీ ప్రసాద్ గుర్తుకువస్తాడు. టాలీవుడ్ లో వీరిద్దరిదీ ఐకానిక్ కాంబినేషన్. సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుంచి రీసెంట్ గా వచ్చిన పుష్ప వరకు ప్రతి సినిమాలోనూ డీఎస్పీ దే బ్లాక్ బస్టర్ మ్యూజిక్. కానీ, అనూహ్యంగా RC17 కు మాత్రం వీరిద్దరి జర్నీకి బ్రేక్ పడింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్న సుకుమార్.. ఈసారి తన ట్రేడ్ మార్క్ స్టైల్ కు భిన్నంగా, ఒక కొత్త సౌండింగ్ కోసం అనిరుధ్ రవిచందర్ ను ఎంచుకున్నారని ఇండస్ట్రీ టాక్. పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్, ఆ తర్వాత వెంటనే చరణ్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా లాంచ్ కు అక్టోబర్ 20న ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మ్యూజిక్ డైరెక్టర్ మార్పు వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
చరణ్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ చేయబోతున్నాడన్న వార్త రాగానే.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనిరుధ్ మార్క్ ఎలివేషన్ మ్యూజిక్ కు, చరణ్ మాస్ ఇమేజ్ తోడైతే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. అనిరుధ్ రవిచందర్.. ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. విక్రమ్ , జైలర్ , లియో ,దేవర లాంటి సినిమాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేసింది. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో అనిరుధ్ ది అందెవేసిన చేయి. అందుకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ అయితేనే కరెక్ట్ అని సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ భావించారని సమాచారం. అనిరుధ్ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది.
మ్యూజిక్ డైరక్టర్ విషయం పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ లో చరణ్ జోడీపై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది . ఎందుకంటే సుకుమార్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎప్పుడూ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.రంగస్థలంలో రామలక్ష్మి , పుష్ప లో శ్రీవల్లి పాత్రలే దానికి ఉదాహరణ. ఇప్పుడు RC17 కోసం ఏకంగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్‌ను హీరోయిన్గా లాక్ చేశారన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అవును.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా దురంధర్ బ్యూటీ సారా అర్జున్ పేరు గట్టిగా వినిపిస్తోంది. చిన్నప్పుడు నాన్న సినిమాలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మ్యాజిక్ చేసిన సారా అర్జున్, రీసెంట్గా ధురంధర్ అనే సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్గా మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ మాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ పక్కన, సారా అర్జున్ను హీరోయిన్గా లాక్ చేస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది.
సాధారణంగా దర్శకుడు సుకుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక కచ్చితంగా ఒక బలమైన కారణం, ఒక మాస్టర్ మైండ్ దాగి ఉంటుంది. స్క్రీన్ మీద బొమ్మ పడేవరకు ఆయన ఆలోచన ఎవరికీ అర్థం కాదు. సారా అర్జున్ క్యాస్టింగ్ వెనుక కూడా అలాంటి ట్విస్టే దాగి ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ కాంబినేషన్ నిజమేనా? లేక సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన రూమరా? అన్నదానిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ విభిన్నమైన జోడీ వెనుక దర్శకుడు సుకుమార్ కచ్చితంగా ఒక ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేసి ఉంటాడన్నది వాస్తవం. కొన్ని లీకుల ప్రకారం.. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం ఉండేలా కథను డిజైన్ చేశారని, ఆ కథ డిమాండ్ మేరకే ఒక ఫ్రెష్ ఫేస్ కోసం సారా అర్జున్ ను ఎంచుకున్నారని టాక్. లేదా సినిమాలో ఒక కీలకమైన పాత్రకు మాత్రమే ఆమెను తీసుకుని, మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ లేదా మరొక టాప్ హీరోయిన్ ను తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సుకుమార్ మాత్రం తన రైటింగ్ తో మరోసారి మ్యాజిక్ చేయడం గ్యారెంటీ.

