బేసిన్ రిజర్వ్ టెస్ట్ డ్రా.. డిఫెన్స్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన న్యూజిలాండ్!

న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య బేసిన్ రిజర్వ్ వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోరులో ఇరు జట్లు హోరాహోరీ పోరాటం కనబరిచాయి. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 239 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరికీ స్పష్టమైన విజయం దక్కలేదు.
రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ మంచి పోరాటం కనబరిచి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ఐదో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లకు కాపాడుకుని భారత్ ను నిలవరించగలిగింది. దీంతో మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది. మొత్తం మ్యాచ్ ను చూసుకుంటే ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 368 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్కోరు సాధించి ప్రత్యర్థి ముందు సవాల్ నిలిపింది. ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంలో ఆ జట్టు బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. హెన్రీ నికోలస్ (175 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (118) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, ఆకాష్ దీప్ 3 వికెట్లు, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు, ప్రసీద్ కృష్ణ 1 వికెట్ పడగొట్టారు. ఇక బుమ్రా ఈ ఇన్నింగ్స్ లోనే అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరపున టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్ 10 లోకి ప్రవేశించాడు.
ఇక మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 720 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది. భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. 9 వికెట్ల నష్టానికి ఏకంగా 720 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం న్యూజిలాండ్ వంటి పిచ్ లపై మామూలు విషయం కాదు. భారత బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలింగ్ దళం పూర్తిగా తేలిపోయింది. కే.ఎల్.రాహుల్ (136), రిషబ్ పంత్ (128) అత్యద్భుతంగా సెంచరీలతో రాణించగా…కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (98) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే మంచి ఆటతీరుతో జట్టు భారీ స్కోరులో తన వంతు పాత్ర పోషించాడు. దేవ్ దత్ పడిక్కల్ (80), ధ్రువ్ జురెల్ (78) కూడా హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అన్షుల్ కాంబోజ్ (38), వాషింగ్టన్ సుందర్ (24) కూడా తమవంతు సహకారం అందించారు. ఇక భారీ ఆధిపత్యంతో భారత్ పట్టు బిగించినట్లు కనిపించినా రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు క్రీజులో నిలకడగా ఆడారు. భారత్ కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. వికెట్లను కాపాడుకుంటూ నెమ్మదిగా, ఓపికగా ఆడుతూ మ్యాచ్‌ను డ్రా వైపు నడిపించింది. డేవాన్ కాన్వే (65), డారీ మిచెల్ (49 నాటౌట్), రాచిన్ రవీంద్ర (37), హెన్రీ నికోలస్ (31), గ్లెన్ ఫిలిప్స్ (24 నాటౌట్) పరుగులు చేశారు. ముఖ్యంగా మిచెల్, ఫిలిప్స్ లు ఢిఫెన్సింగ్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణకు 2 వికెట్లు, బుమ్రా, అన్షుల్ కాంబోజ్, వాషింగ్టన్ సుందర్ లకు ఒక్కో వికెట్ దక్కింది. మొత్తానికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో టెస్టు హాగ్లే ఓవల్, క్రిస్ట్ చర్చ్ వేదికగా ఈ నెల 27 నుండి డిసెంబర్ 1 వరకు జరగనుంది.
కామెంట్లు (0)
సంబంధిత వార్తలు

SENA దేశాల్లో ఆ ఘనత సాధించిన రాహుల్…వెల్లింగ్టన్ టెస్టులో పటిష్ట స్థితిలో భారత్

వెల్లింగ్టన్ టెస్టు: కివీస్ 368 ఆలౌట్.. జైస్వాల్, రాహుల్ అర్ధ సెంచరీలతో భారత్ ఘనమైన ఆరంభం!

