రియల్ లైఫ్ హీరోలు..400 కుటుంబాలకు అండగా విరోష్
కామెంట్లు (0)

టాలీవుడ్ క్యూట్ అండ్ సెన్సేషనల్ పెయిర్ విరోష్ జోడీ అదేనండి మన విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంట తాజాగా తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తెరపై విరోష్ జంట మ్యాజిక్ ఏంటో మనకు తెలుసు, కానీ ఇప్పుడు వాళ్లు నిజ జీవితంలో చేసిన ఒక పనికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 400 కుటుంబాలకు వాళ్లు అండగా నిలబడ్డారు. ఈ 400 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు, వాళ్లకు కావాల్సిన రేషన్, నిత్యావసరాలు అందిస్తామని స్వయంగా రష్మిక మందన్న తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. 1876 నుంచి 78 నాటి మద్రాసు కరువు నేపథ్యంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలనపై పోరాడే యోధుడిగా విజయ్ , అతని భార్య జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. ఆ మద్రాసు కరువు సమయంలో ప్రజలు పడ్డ ఆకలి బాధలు, కష్టాలు రష్మిక మనసును తీవ్రంగా కలచివేశాయట. సినిమాలో జయమ్మ పాత్ర చేస్తున్నప్పుడు, ఆనాటి పరిస్థితులు తన కళ్ళ ముందు కదులుతున్నట్లు అనిపించిందని, ఆకలి అనేది ఎంతటి నరకమో ఆ పాత్ర ద్వారా తను రియలైజ్ అయ్యానని రష్మిక ఎమోషనల్గా చెప్పింది. ఆ ఫీలింగ్, ఆ బాధే ఇప్పుడు నిజ జీవితంలో ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు అండగా నిలబడాలన్న ఆలోచనను తనలో రగిలించిందని తెలిపింది. అందుకే ఈ నవరాత్రి పండుగ శుభ సందర్భంగా, విజయ్తో కలిసి 400 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు స్వయంగా రష్మిక తన పోస్ట్లో తెలిపింది. మరి ఈ 400 కుటుంబాలకు వాళ్లు ఎలా సాయం చేయబోతున్నారు? రష్మిక పోస్ట్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ను వాళ్లు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎంపిక చేసిన ఈ 400 పేద కుటుంబాలకు ఒకేసారి కాకుండా, 3 నెలలకు సరిపడా రేషన్, కిరాణా సరుకులు అందిస్తారు. ఇలా ఒక ఏడాది పాటు ఈ కుటుంబాల సరుకుల బాధ్యతను వాళ్లే తీసుకుంటారు.దీని వెనుక ఉన్న లాజిక్ కూడా రష్మిక వివరించింది. మేము వీళ్లకు సరుకులు అందించడం వల్ల, ఆ కిరాణాకు అయ్యే ఖర్చును వాళ్లు ఆదా చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసిన డబ్బుతో వాళ్ళ పిల్లల చదువులకో, భవిష్యత్తుకో వాడుకుంటారు కదా. ఇలా ఒక ఏడాది పాటు వాళ్లకు సపోర్ట్ ఇస్తే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటపడుతుంది అని తన ఆలోచనను పంచుకుంది. ఈ డెసిషన్ తో తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ విజయ్, రష్మిక రియల్ హీరోస్ అని మరోసారి నిరూపించుకున్నారు.



