రెండో పెళ్లి చేసుకున్న జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా..వధువు ఈమె..?

ఒకవైపు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా వరుస సవాళ్లు ఎదుర్కొంటూనే, మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఒమర్ అబ్దుల్లా. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇప్పుడు తన 56 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. అది కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక ప్రముఖ మహిళా జర్నలిస్ట్ ను ఆయన వివాహం చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో పంచుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి పూర్తయిన తర్వాత, నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది అంటూ ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా తమ పోస్ట్ వెడ్డింగ్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అదే సమయంలో నిధి రజ్దాన్ కూడా తన అఫీషియల్ అకౌంట్లో పెళ్లి ఫొటోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. జాతీయ స్థాయి రాజకీయ నాయకులు,జర్నలిస్టులు , పార్టీ కార్యకర్తలు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒమర్ అబ్దుల్లాకే కాదు, నిధి రజ్దాన్ కు కూడా ఇది రెండో పెళ్లే కావడం గమనార్హం.
ఒమర్ అబ్దుల్లా తన మొదటి భార్య పాయల్ నాథ్‌ను 1994లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ ఇద్దరి మధ్య వచ్చిన తీవ్రమైన మనస్పర్థల కారణంగా 2009లోనే ఈ జంట విడిపోయింది. అయితే తాము విడిపోయినట్లు 2011లో ఒమర్ అబ్దుల్లా, పాయల్ అబ్దుల్లా బహిర్గతం చేశారు. అప్పటినుంచి వారు వేర్వేరుగానే ఉంటున్నారు. విడాకుల కోసం ఒమర్ అబ్దుల్లా ఫ్యామిలీ కోర్టును, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘంగా సాగిన న్యాయపోరాటం తర్వాత, చివరకు ఈ కేసు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. 2026 జూలై 31న వారి పరస్పర అంగీకారంతో ఈ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలా చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న కేవలం మూడు నెలలకే ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు నిధి రజ్దాన్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.



