వంద కాదు వెయ్యిసార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్స్‌కి రష్మిక కౌంటర్!

తన పర్సనల్ లైఫ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెడుతూ ట్రోలర్స్ కు స్టార్ హీరోయిన్ రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది రష్మిక , విజయ్ లు వివాహా బంధంతో ఒక్కటయ్యారు. . అయితే వీరి పర్సనల్ లైఫ్ పై ఇటీవల సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక ఘాటుగా స్పందించింది. తమ బంధం గురించి అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టింది.ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా వీరు పాల్గొన్న కాఫీ విత్ కరణ్ సీజన్ 9 పాపులర్ టాక్ షో లో వాళ్ల పెళ్లి, ప్రపోజల్ గురించి సరదాగా పంచుకున్న కొన్ని విషయాలను పట్టుకుని కొంతమంది నెటిజన్లు విజయ్‌పై దారుణమైన ట్రోల్స్ మొదలుపెట్టారు.
తమ బంధంపై, తాను విజయ్‌పై చూపిస్తున్న ప్రేమపై కామెంట్స్ చేస్తున్న వారికి రష్మిక ఘాటుగానే సమాధానమిచ్చింది. అవును.. నేను నా భర్త విషయంలో పిచ్చిగా ఉన్నాను. ఒక భార్య తన భర్తను అంతగా ప్రేమించడం ఎప్పటినుంచి తప్పు అయిపోయింది?. అంటూ ఆమె నేరుగా నెటిజన్లను ప్రశ్నించారు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ప్రేమించకపోతే అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? జీవితాంతం నాకు తోడుగా ఉండే వ్యక్తి, సాధారణ రోజుల్లోనూ ప్రత్యేక సందర్భాల్లోనూ నాకు స్నేహితుడిగా నిలిచే వ్యక్తి విజయ్. నా పిల్లలకు తండ్రిగా, నేను వృద్ధాప్యంలోకి వెళ్లినప్పుడు కూడా తోడుగా ఉండే వ్యక్తిగా అతడు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తే తప్పేంటి? అలాంటి వ్యక్తిని అమితంగా ప్రేమిస్తున్నానని చెప్పడానికి నేను వెనుకాడను.అని రష్మిక తన ప్రేమను మరోసారి ధృడంగా వ్యక్తం చేశారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం ఇంటర్వ్యూలో విజయ్ చెప్పిన ఒక చిన్న మాట. పెళ్లికి తాను ఏడాది సమయం తీసుకున్నానని విజయ్ చెప్పిన విషయాన్ని పట్టుకుని నెటిజన్లు ఆయన్ని టార్గెట్ చేశారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏడాది ఎందుకని, అతనొక రెడ్ ఫ్లాగ్ అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై రష్మిక పూర్తి క్లారిటీ ఇచ్చారు. తను ఎప్పుడూ మనసు చెప్పినట్లు వింటానని, కానీ విజయ్ పక్కా ప్రాక్టికల్‌గా ఆలోచించే వ్యక్తని ఆమె చెప్పారు. జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడంలో తప్పేమీ లేదని విజయ్ ని సపోర్ట్ చేశారు. మా ఇద్దరి భిన్నమైన ఆలోచనా విధానాలే మమ్మల్ని ఒక పర్ఫెక్ట్ జంటగా మార్చాయి. మోకాలిపై కూర్చొని చేసే గ్రాండ్ ప్రపోజల్స్, ఖరీదైన రింగ్‌ల కంటే కలిసి నిర్మించుకునే జీవితమే మాకు ముఖ్యం అని రష్మిక చాలా మెచ్యూర్డ్ గా ఆన్సర్ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో ఉచిత సలహాలు ఇచ్చే వారికి రష్మిక ఒక చేదు నిజాన్ని గుర్తుచేశారు. నేను తీవ్రమైన మానసిక ఆందోళనతో రాత్రిళ్ళు నిద్రలేచినప్పుడు, నొప్పితో బాధపడినప్పుడు లేదా నా కెరీర్లో కష్ట కాలంలో ఉన్నప్పుడు మీరెవరూ అక్కడ లేరు.. విజయ్ మాత్రమే నా పక్కన ఉన్నాడు. అంటూ రష్మిక స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చింది. ఇంటర్నెట్లో కట్ చేసిన వీడియోలు, తప్పుడు ప్రచారాలను గుడ్డిగా నమ్మే బదులు, నా జీవితం గురించి నేను స్వయంగా చెప్పేది నమ్మకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె నెటిజన్ల తీరును ఎండగట్టారు. ట్రోలింగ్ పేరుతో కొందరు ఫేక్ ఐడీలు తమ కుటుంబాలను కూడా వివాదంలోకి లాగుతుండటంపై రష్మిక మండిపడ్డారు. నా గురించి ఏం మాట్లాడినా నేను భరిస్తాను, కానీ నా విజ్జు గురించి తెలియకుండా మాట్లాడితే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది ఫెమినిజం పేరుతో విజయ్ ని టార్గెట్ చేయడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫెమినిజం అంటే ఒక మహిళ తీసుకున్న నిర్ణయాలను గౌరవించడం, అంతే తప్ప ఫెమినిజం పేరుతో ఒకరిపై వేధింపులకు దిగడం కాదు అని గట్టిగా హితవు పలికారు. చివరగా, గత 10 సంవత్సరాలుగా తనకు మద్దతుగా నిలుస్తున్న కన్నడ అభిమానులకు, తనను ఎంతగానో ప్రేమించే ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.



