USలో ట్రంప్ కు వ్యతిరేఖ గాలి…భారత్-పాకిస్తాన్ పై వేర్వేరు ప్రభావాలు

ప్రపంచానికి పెద్దన్న చెప్పుకునే అమెరికాలో రాజకీయాలు మారితే ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆసియా ఖండంలోని ఇండియా, పాకిస్థాన్ లాంటి దేశాల విదేశాంగ విధానాలు అమెరికా పాలిటిక్స్ పైనే ఆధారపడి ఉంటాయి. తాజాగా జరిగిన యూఎస్ మిడ్ టెర్మ్ ఎలక్షన్స్ లో అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు అతి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా చట్టసభలైన కాంగ్రెస్ ఉభయ సభలను డెమొక్రాట్లు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఒక బ్లూ వేవ్ తో రిపబ్లికన్లను వెనక్కి నెట్టారు. 2029 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, చట్టసభల్లో మెజారిటీ లేకపోవడంతో ఆయన నిర్ణయాలకు తీవ్రమైన అడ్డంకులు ఉండనున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ట్రంప్ మిగిలిన రెండేళ్ల పదవీకాలంలో ఆయనకు కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పరిణామం ఇండియాకు ఒక విధంగా బేరసారాలు ఆడేందుకు ప్లస్ పాయింట్ కాబోతోంది. మిడ్ టెర్మ్ ఎలక్షన్స్ లో ఎదురుదెబ్బ తగలడంతో, తన మద్దతుదారులైన మాగా బేస్ కు తన సత్తా చాటుకోవడానికి ట్రంప్ ఇప్పుడు ఏదో ఒక అతిపెద్ద విదేశాంగ విజయం కోసం ఆరాటపడతారు. ఇందులో భాగంగానే ఇండియాతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ట్రంప్ ఆసక్తి చూపిస్తారు. వాస్తవానికి చైనా, వియత్నాం దేశాల కంటే మెరుగైన టారిఫ్ నిబంధనలు ఇస్తేనే ఒప్పందం చేసుకుంటామని భారత్ ఇన్నాళ్లూ గట్టిగా నిలబడింది. మరోవైపు ట్రంప్ యంత్రాంగం కూడా సెక్షన్ 301 కింద భారత్ పై విచారణ చేస్తూ కఠినంగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు ట్రంప్ స్వయంగా వీక్ అవ్వడంతో, భారత బృందానికి బేరసారాలు ఆడేందుకు మంచి అవకాశం దొరికినట్లేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇండియన్స్ కు అత్యంత కీలకమైన అంశం హెచ్-1బీ వీసాలు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక స్కిల్డ్ ఫారిన్ వర్కర్లపై ఎన్నో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్-1బీ వీసాలకు ఏకంగా లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడంతో పాటు, అమెరికన్లను ఉద్యోగాల నుంచి తీసేస్తున్న కంపెనీల వీసా అప్లికేషన్లపై ఫెడరల్ ఏజెన్సీలతో కఠిన స్క్రూటినీ చేయించారు. అమెరికా టెక్ సెక్టార్ కు వెన్నెముకగా ఉన్న ఇండియన్ టెకీలే ఈ వీసాల్లో దాదాపు 75 శాతం ఉంటారు కాబట్టి, ఈ దెబ్బ నేరుగా భారతీయుల పైనే పడింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ డెమొక్రాట్ల చేతికి రావడంతో ఈ విధానంపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. టాలెంట్ ఉన్న విదేశీయులను అడ్డుకోవడం వల్ల అమెరికా టెక్ సంస్థలకే నష్టం జరుగుతోందని డెమొక్రాట్ చట్టసభ సభ్యులు మొదటినుంచీ విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్లే పవర్ లో ఉన్నారు కాబట్టి ట్రంప్ వీసా విధానాల ఆర్థిక పరిణామాలపై తీవ్రమైన స్క్రూటినీ జరగబోతోంది. షార్ట్ టర్మ్ లో పెద్దగా మార్పు లేకపోయినా, లాంగ్ టర్మ్ లో ఇండియన్ టెకీలకు ఇది కచ్చితంగా ఒక గుడ్ న్యూస్. అయితే ఇక్కడ ఇండియాకు కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది. డెమొక్రాట్లు ఎప్పుడూ మానవ హక్కులు, మత స్వేచ్ఛ, మైనారిటీల హక్కుల పేరుతో కాస్త క్రిటికల్ గా ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఢిల్లీకి, వాషింగ్టన్ కు మధ్య దీనిపై డైలాగ్ వార్ అవకాశాలు కనిపిస్తున్నాయి.



