రామాయణంపై రాజమౌళి రివ్యూ

భారతీయ చలనచిత్ర రంగాన్ని బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి . ఒక సినిమా గురించి ఆయన పాజిటివ్ గా ఒక్క మాట మాట్లాడితే చాలు ఆ సినిమా స్థాయి మరింత పెరిగినట్లే అని ప్రేక్షకులు కూడా భావిస్తుంటారు. తాజాగా నితీష్ తివారీ దర్శకత్వంలో, అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ రామాయణ చిత్రాన్ని రాజమౌళి చూశారు. థియేటర్లో ఆ విజువల్ వండర్ చూసి ఫిదా అయిన ఆయన.. తన ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సినిమాపై రివ్యూ ఇచ్చారు. ముఖ్యంగా రాకింగ్ స్టార్ యశ్ పోషించిన లంకాధిపతి రావణాసురుడి పాత్రపై, అలాగే శ్రీరాముడిగా రణబీర్ కపూర్ , సీతగా సాయి పల్లవి నటనపై జక్కన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రామాయణ పై రాజమౌళి స్పందించారు. రాజమౌళి తన ట్వీట్ లో ప్రధానంగా రామాయణం స్కేల్ గురించి, అందులో నటించిన నటీనటుల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. రామాయణం... బిగ్ స్క్రీన్ పై ఈ సినిమా విజువల్స్, ఆ స్కేల్ చూడటానికి అత్యంత అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా వనవాసం ఘట్టం మొదలైన దగ్గరి నుంచి శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటన అత్యంత ప్రశాంతంగా ఉంటూనే, ఒక అద్భుతమైన తేజస్సుతో నన్ను కట్టిపడేసింది. రాముడి రాజసం రణబీర్ లో పర్ఫెక్ట్ గా కనిపించింది అని రాజమౌళి కొనియాడారు. ఇక సీతాదేవి పాత్రలో నటించిన మన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటనపై స్పందిస్తూ.. సాయి పల్లవి తనదైన సహజ నటనతో, ఎంతో హుందాతనంతో సీత పాత్రకు ప్రాణం పోసింది అని అభినందించారు. ఇక ఈ సినిమాలో రావణాసురుడిగా నటించిన రాకింగ్ స్టార్ యష్ పాత్ర గురించి చెబుతూ..రావణుడి పాత్రకు యశ్ తెచ్చిన గాంభీర్యం, అతని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా మొత్తానికే హైలైట్ అంటూ రాజమౌళి ప్రత్యేకంగా ప్రశంసించారు. భారతీయ ఇతిహాసాలను తెరకెక్కించాలంటే ఒక గట్టి విజన్ ఉండాలి. రామాయణాన్ని అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో తెరపైకి తీసుకొచ్చిన దర్శక నిర్మాతల కృషిని రాజమౌళి మనస్ఫూర్తిగా అభినందించారు. చిత్రంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్క క్షణం అత్యంత అద్భుతంగా వచ్చాయని, ప్రతి ఫ్రేమ్‌ను తాను ఎంతో ఎంజాయ్ చేశానని ఆయన తన పోస్ట్ లో తెలిపారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన, దృశ్య కావ్యాన్ని ఒక గొప్ప ఆశయంతో చాలా అందంగా సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన డైరెక్టర్ నితీష్ తివారికి, నిర్మాత నమిత్ మల్హోత్రాలకు , రామాయణం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక ఈ సినిమాకు మొదటి రోజే పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు భారతీయ దర్శకులలో ప్రతిభావంతుడైన రాజమౌళి ఇచ్చిన ఈ అదిరిపోయే రివ్యూతో రామాయణ సినిమాపై ఉన్న హైప్ పదింతలు పెరిగింది.



