సడెన్‌గా ఏమైంది? 9 నెలలుగా నో చెబుతున్న మృణాల్ అసలు కారణం అదేనా..?
కామెంట్లు (0)

సీతారామం సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసింది మృణాల్ ఠాకూర్ . ఆ సినిమా చూసిన తర్వాత, ఇక టాలీవుడ్‌ను ఏలే మహారాణి దొరికేసిందని అందరూ అనుకున్నారు. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. కానీ సడెన్‌గా ఏమైంది? గత 9 నెలలుగా మృణాల్ ఠాకూర్ ఒక్క కొత్త సినిమాకు కూడా సైన్ ఎందుకు చేయలేదు.
పుష్ప-2 లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత అల్లు అర్జున్, జవాన్ లాంటి 1000 కోట్ల హిట్ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తోన్న పాన్ ఇండియా మూవీ రాకా. 2027లో రిలీజ్ కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని, ఆ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను ఫైనలైజ్ చేశారని గత వారం రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చేసింది.
మీరు అల్లు అర్జున్ రాకాలో భాగం అవుతున్నారా? అని ఇంటర్వ్యూలో విలేఖరి అడగగానే.. దానికి మృణాల్ చెప్పిన సమాధానం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఆమె ఆ వార్తలను ఖండించలేదు, అలాగని అవునని కూడా చెప్పలేదు. నేను దాదాపు 9 నెలలుగా ఏ సినిమాకి సైన్ చేయలేదు. మంచి అర్థవంతమైన పాత్ర కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఒకవేళ అలాంటి మంచి ప్రాజెక్ట్ వస్తే, దాని గురించి నేనే స్వయంగా నా సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అనౌన్స్ చేస్తాను. ఆ తర్వాతే ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి ఇష్టపడతాను అని చాలా డిప్లొమాటిక్‌గా ఆన్సర్ ఇచ్చింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. మేకర్స్ ఇంకా ఎవరినీ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కాబట్టి మృణాల్ కూడా సస్పెన్స్ మెయింటైన్ చేస్తోందా? అనేది అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఏది ఏమైనా రాకా సినిమాలో తన గురించి వస్తున్న పుకార్లకు మాత్రం ఆమె ఒక చెక్ పెట్టింది.



