దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల బాటలోనే పయనించాయి. పీఎస్యూ బ్యాంక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లు రాణించడంతో స్వల్ప లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 173.81 పాయింట్ల లాభంతో 83,450.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42.65 పాయింట్ల లాభంతో 25,725.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకపు విలువ 90.68గా ఉంది. సెన్సెక్స్ 30 లో ఐటీసీ, బీఈఎల్, ఎల్అండ్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐటీ రంగం జోరు కనబరిచింది. అదానీ గ్రూప్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మంచి ర్యాలీని కనబరిచాయి.అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి.